హెల్మెట్ ధరిస్తే లీటర్ పెట్రోల్ ఫ్రీ.. ట్రాఫిక్ పోలీసుల బంపర్ ఆఫర్

 ఎల్. బీ. నగర్ ట్రాఫిక్ పోలీసులు వినూత్న కార్యక్రమం కార్యక్రమం చేపట్టారు. 31 వ రోడ్డు భద్రతా వారత్సవాలను పురస్కరించుకొని,  బైక్  పై  వెళ్తున్న డ్రైవర్ సహా వెనుక వ్యక్తి సైతం హెల్మెట్ ధరించి పయణిస్తే, ట్రాఫిక్ పోలీసులు తమ సొంత ఖర్చుతో ఒక లీటర్ పెట్రోల్ కూపన్లు  అందజేశారు. ఈసందర్భంగా  అడిషనల్ ఇన్స్పెక్టర్ అంజపల్లి నాగమల్లు  మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం దాదాపు ఐదు లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాని, ఈ ప్రమాదాల్లో లక్షా యాబై వేలమంది చనిపోతున్నారన్నారు. దీంతో రెండు లక్షల మంది అంగవైకల్యానికి గురవుతున్నారని తెలిపిన ఆయన.. హెల్మెట్ ధరించకపోవడం వల్లే అరవై శాతం మంది ప్రమాదాల్లో చనిపోతున్నారని ఆవేదనగా తెలిపారు. విలువైన ప్రాణాలు కాపాడేందుకు సమాజహితం కోరుకునే వారిగా,  ట్రాఫిక్ పోలీసులుగా ప్రజలకు అవగాహన కలిగిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్సై రమేష్, సిబ్బంది భాస్కర్, సాయి కుమార్, రాకేష్, తదితరులు పాల్గొన్నారు.