న్యూజిల్యాండ్‌తో ఉత్కంఠగా సాగిన నాల్గొవ టీ20 మ్యాచ్‌లో భారత్ గెలుపొందింది. వెల్లింగ్టన్ వేదికగా జరిగిన నాల్గొవ టీ20 మ్యాచ్ మొదట టై గా ముగిసింది. టాస్ గెలిచిన న్యూజిల్యాండ్ బౌలింగ్‌ను ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. అనంతరం 166 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ బరిలోకి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి సరిగ్గా 165 పరుగులు చేసింది. మరోసారి మ్యాచ్ టై గా ముగిసింది. దీంతో సూపర్ ఓవర్ నిర్వహించారు.
సూపర్ ఓవర్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ వికెట్ నష్టానికి 13 పరుగులు చేసింది. 14 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ మరో బంతి మిగిలి ఉండగానే విజయాన్ని చేజిక్కించుకుంది. కేఎల్.రాహుల్ మొదటి బాల్‌ను సిక్స్.. రెండో బాల్ ఫోర్‌గా మలచి.. మూడో బాల్‌కు ఔట్ అయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లీ తదుపరి రెండు బంతులు ఆడి రెండు పరుగులు, బౌండరి బాది విక్టరీని ఖాయం చేశాడు. దీంతో భారత్ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. మూడో టీ20 మ్యాచ్ సైతం సూపర్ ఓవర్‌కు దారితీయడంతో కివీస్ టిమ్ సౌథీకి బౌలింగ్ అప్పగించింది. ఆ మ్యాచ్‌లో కివీస్ ఓడిపోయింది. నాల్గొవ టీ20 సైతం సూపర్ ఓవర్‌కు దారితీయగా కివీస్ మరోసారి సౌథీనే నమ్ముకుంది. కానీ అతడు ఆ జట్టు ఆశలను వమ్ముచేశాడు.